0487 2329000 [email protected] Peringottukara, Thrissur

ఉత్సవాలు దేవస్థాన ఉత్సవం తిరవెల్లాటు

thiravellaattu

విష్ణుమయస్వామి జన్మదినాన్ని తిరవెల్లాట్టుగా నిర్వహిస్తారు. భక్తుల కోరికలు ఫలించేందుకు ఇది శుభమైన రోజు. తదుపరి ఉత్సవం ఏ రోజున నిర్వహించాలన్నది ఆ రోజున నృత్యం చేసే స్వామి తెలియజేస్తారు. ఈ రోజున కుక్షికల్పం నుంచి ఆలయ వ్యవస్థాపక పూజారి శ్రీ వేలుముత్తప్పన్ విగ్రహాన్ని కూడా విష్ణుమయస్వామి విగ్రహంతో పాటు వెలుపలికి తీసుకువస్తారు. ఈ ఉత్సవాలు 9 రోజులపాటు జరుగుతాయి. దేవుడి ప్రీత్యార్థం సంగీత విభావరులు కూడా నిర్వహిస్తారు. ఉత్సవాల్లో మొదటి రోజు కాలం, ఆ రోజు మొదటి పూజ వేలు ముత్తప్పన్ కు నిర్వహిస్తారు. తన పరమభక్తుడైన వేలుముత్తప్పన్ ను తొలుత ఆరాధించాలన్నది స్వామివారి ఆదేశం. ఆ తర్వాతి రోజు నుంచి మిగిలిన 7 కల్లాలు ఏర్పాటు చేస్తారు. చివరి రోజు విష్ణుమయ కాలం రూపొందిస్తారు. దీన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో రూపొందిస్తారు. ఆభగవంతుడి సంపూర్ణ రూపకాలాన్ని దర్శించిన భక్తుల కోరికలన్నీతీరుతాయి. ఈ అవకాశం సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది. ఈ రూపకాలంపై దేవుడు తన పాదాన్ని మోపుతారు. ఇది ఎంతో పవిత్రమైనది. ఆ తర్వాత ఆ
రూపకల్లం

కళామేలుతుపట్టు ఉత్సవం

kalamezhutthupaatt

మలయాళ మాసం కరిక్కిదకం, వృశ్చికపు (జూలై) మండలకాలంలో కేవలం స్వస్తిక పూజ నిర్వహిస్తారు. ఈ పూజకు ముందు కళామేలుతుపట్టు ఉత్సవాలను మిధున, తుల మాసాల్లో (నవంబర్) నిర్వహిస్తారు. స్వామివారిని దర్శించుకునేందుకు ఈ రోజులు అత్యంత దివ్యమైనవి. స్వామివారి కల్లం నుంచి ధూళిని తీసుకొని ఇంట్లో పూజమందిరంలో పెట్టుకొని పూజిస్తే ఎంతో మేలు జరుగుతుంది. అంతే కాదు స్వామివారి కల్లం దుష్టశక్తులను పారదోలుతుంది.

తొట్టంపట్టు (భువనేశ్వరిదేవిని కీర్తిస్తూ గానం)

thottampaattu

తిరువెల్లాటు సంపూర్ణమైన తర్వాత అమ్మవారు భువనేశ్వరిదేవిని ప్రసన్నం చేసుకునేందుకు తొట్టంపట్టు ఉత్సవం నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో భాగంగా కళామేళుతు ( నేలపై అమ్మవారి చిత్రాన్ని గీసి అలంకరించడం) చేయడం, అమ్మవారి ప్రతిమను సంప్రదాయ వాయిద్యాలు, మేళతాళాల మధ్య ఊరేగిస్తారు.

Call Now
× Whatsapp Us
Visit Us On FacebookVisit Us On Youtube